Ugadi : ఉగాది నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు ?

Ugadi : ఉగాది నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదు ?

ఉగాది రోజున (APR 9) ఏ పనులు చేయాలనేది పురాణాల ద్వారా తెలుస్తోంది. పండుగ రోజు ఏ పనైతే చేస్తామో అదే పనిని ఏడాదంతా చేస్తామని పెద్దలు చెబుతుంటారు. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. దేవుడిని ఆరాధించి, సూర్య నమస్కారం చేయాలి. ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలి. పేదలకు తోచిన సాయం అందించాలి. ఉగాది పచ్చడి చేసుకుని తినాలి. ఇలా చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలుగు ప్రజల నమ్మకం.

ఉగాది నాడు చేయకూడని పనులు:

ఉగాది నాడు బద్దకంగా ఉండకూడదు. ఆ రోజున కూడా ఆలస్యంగా నిద్ర లేవడం అంత మంచిది కాదంటున్నారు పండితులు. ముఖ్యంగా ఈ పర్వదినాన ఆల్కహాల్, సిగరేట్, మాంసాహారాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఆ రోజున పంచాంగ శ్రవణాన్ని.. దక్షిణం ముఖాన కూర్చొనే చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవీ అనుగ్రహం మీపై ఉండదని పురాణాలు చెబుతున్నాయి.

ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిదీ కాదు కాబట్టి, ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళ్లమని చెబుతారు. ఉగాది నూతన సంవత్సరానికి సూచన కాబట్టి కొత్త పనులను చేపట్టమని ప్రోత్సహిస్తారు. ఉగాది రోజున చేయవలసిన పనులు ఇన్ని ఉన్నాయన్నమాట.

Tags

Read MoreRead Less
Next Story