Former MLA G. Loknath : గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి

Former MLA G. Loknath :  గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి
X

కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే జి.లోక్‌నాథ్ (75) గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు. 1989లో ఆలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రంగన్న (టీడీపీ)పై గెలిచారు. లోక్‌నాథ్ స్వగ్రామం ఆలూరు మండలంలోని మొలగవల్లి. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. లోకనాథ్ స్వగ్రామం మొలగవల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags

Next Story