Ramadan Celebrations : ఘనంగా రంజాన్.. పిల్లలు, పెద్దల ఆత్మీయ ఆలింగనాలు

ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, కరుణ, ఐకమత్యం సందేశాలతో సేవాతత్పరత, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదర, సోదరీమణులు భక్తి, శాంతి, సౌభాగ్యంతో జరుపుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నెలరోజులపాటు కఠిన ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, ప్రార్థనలతో ముగిసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇస్లాంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ప్రేమ, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీక రంజాన్ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ముస్లింలు వారి వారి స్థానిక ఈద్గాలు, మసీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ఈద్గా వద్దకు స్థానిక ఎమ్మెల్యేలు, లీడర్లు చేరుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com