గ్రేట్ .. చనిపోతూ ఐదుగురిని బతికించావ్!

ఓ గృహిణి ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది. జగిత్యాల జిల్లా అంబారిపేటకు చెందిన గోపు రాధ (38) ఈ నెల 12న అకస్మాత్తుగా ఇంట్లో పడిపోయారు. కిమ్స్‌లో చేర్పించగా, 13న బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. రాధ నాలుగేళ్లుగా నరాల సంబంధిత వ్యాధితో బాధ పడుతోంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్తూ చికిత్స తీసుకొని, ఇంటి వద్దే ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 10న మళ్లీ అనారోగ్యానికి గురవడంతో కుటుంబసభ్యులు ఇంతకుముందు వైద్యం పొందిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగా 12వ తేదీ రాత్రి బ్రెయిన్ డెడ్ అయ్యింది. ‘జీవన్ దాన్’ టీమ్ ఆమె కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించింది. దీంతో ఆమె గుండె, రెండు కిడ్నీలు, కాలేయం, ఒక ఊపిరితిత్తి సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురు రోగులకు అమర్చారు. మృతురాలి భర్త శ్రీనివాస్ అంబారిపేట మాజీ సర్పంచ్. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com