AP 10th Advanced Supplementary Exams : 24 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో ఈనె 24వ తేదీ నుంచి పదవ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఈ పరీక్షలకు మొత్తం 1.61 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. వీరి కోసం 684 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.
పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ ఇప్పటికే అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ పేరు, జిల్లా, పాఠశాల, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com