AP EAPCET Results : నేడు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు

AP EAPCET Results : నేడు ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు

నేడు ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్&ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు విజయవాడలో సెట్ ఛైర్మన్ ప్రసాదరాజు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 3.39 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. EAPCETలో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. దీని ఆధారంగా ర్యాంకులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు.

ఇంజినీరింగ్ విభాగంలో 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభా గాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు. ఈ ఏపీ సెట్‌ ఫలితా లను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx లో అందుబాటులో ఉంచుతారు. ఏపీ ఈఏపీ సె ట్ లో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇస్తారు. ఈ మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. ఫలితాలతో పాటు కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను కూడా నేడు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags

Next Story