AP ECET Results Released : ఈసెట్ ఫలితాలు విడుదల

X
By - Manikanta |30 May 2024 12:21 PM IST
ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీఈసెట్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు ఛైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి ఫలితాలను విడుదల చేశారు.ఫలితాల్లో 93.34 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు. ఏపీఈసెట్ 2024 ప్రవేశ పరీక్షను మే 8న రాష్ట్రంలోని 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com