Inter Results : ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు?

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారట. ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు ఇవాళ మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏవైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఫలితాల విడుదల ఒకట్రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది మార్చి 1 నుంచి మార్చి 20 వరకూ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు కలిపి దాదాపు 10 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఆదివారమే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి ఫలితాలను విడుదల చేయబోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com