AP Inter 2nd Year Supplementary Results : నేడు ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు

AP Inter 2nd Year Supplementary Results : నేడు ఏపీ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు
X

నేడు ఏపీ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అధికారులు రిజల్ట్స్ వెల్లడించనున్నారు. దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌ ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. మే 24 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్ని రోజుకు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఈ ఏడాది ఇంటర్మిడియెట్‌ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను ఇంటర్‌ బోర్డు తొలిసారిగా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేసింది. ఆ రోజు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేస్తారు. అనంతరం ఈ నెల 26న ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

Tags

Next Story