AP Polytechnic : మే23 నుంచి ఏపీ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్

AP Polytechnic : మే23 నుంచి ఏపీ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
X

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 27 నుంచి జూన్ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ఈ నెల 31 నుంచి జూన్ 5వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు, 5వ తేదీనే ఆప్షన్స్ మార్చుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. జూన్ 7న సీట్ల కేటాయింపు.. 10 నుంచి 14 వరకు ప్రవేశాల ఖరారు కొనసాగుతుంది.

జూన్ 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పాలిసెట్‌లో మొత్తం 1,24,430 మంది అర్హత సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు మొత్తం 267 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది.

Tags

Next Story