AP POLYCET 2024 : ఏపీ పాలిసెట్ షెడ్యూల్‌లో మార్పులు

X
By - Manikanta |30 May 2024 12:30 PM IST
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ పాలిసెట్-2024 కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో సాంకేతిక విద్యాశాఖ మార్పులు చేసింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను జూన్ 6కు మార్చినట్లు తెలిపారు. జూన్ 2 వరకు ఉన్న ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో ఎలాంటి మార్పూ లేదని చెప్పారు.
జూన్ 7 నుంచి 10 వరకు కళాశాలలు, కోర్సులకు వెబ్ ఐచ్ఛికాల నమోదు చేసుకోవచ్చని సూచించారు. 11న ఆప్షన్ల మార్పు, 13న తుది సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. జూన్ 14 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, 19లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. జూన్ 2 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com