AP Degree Admissions : ఏపీలో డిగ్రీ అడ్మిషన్లకు నేడు నోటిఫికేషన్

ఏపీలో డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నేడు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో 3.20 లక్షల వరకు సీట్లుండగా ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయనున్నారు. కాగా ఈసారి బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులు అఖిల భారత విద్యామండలి(ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. దీంతో చాలా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి పర్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్లకు జాప్యం జరిగింది.
మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నేడు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. https://cse.ap.gov.in/ వెబ్‌సైటులో పరీక్షా వివరాలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణ తేదీపై ఇవాళ స్పష్టత రానుంది. ఆగస్టు నెలలో టెట్ నిర్వహించే ఛాన్సుంది. అలాగే మెగా DCSకి సంబంధించి వారం రోజుల్లో ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. టెట్, డీఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com