AP : ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత కోటా అప్లికేషన్లకు నోటిఫికేషన్ రిలీజ్

విద్య ఖరీదైపోయిన రోజులు ఇవి. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ఉపయోగించుకుని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ ఉచితంగా ప్రవేశం దక్కించుకునే వీలుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద, వెనుక బడిన వర్గాల విద్యార్దులకు కేటాయించాల్సి ఉంది. అర్హులైన ఓసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బాధితులకు ఇది వర్తిస్తుంది.
ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ 25శాతం కోటా సీట్లకు అప్లికేషన్ పెట్టుకునేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. https://cse.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలకు 1800 425 8599 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించవచ్చు.
అర్హత గల విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. విద్యాహక్కు చట్టం కింద 2024-25 విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వారు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com