School Holidays : స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

School Holidays : స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

రెండు తెలుగు రాష్ట్రాలోని (Telugu States) ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా….ఆ తర్వాత 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అలాగే రెండు ప్రభుత్వాలు విడుదల చేసిన క్యాలెండర్ లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయి.

మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవులు రానున్నాయి. వరుసగా సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఖుషీ అవుతున్నారు.

మరోవైపు తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనుండగా… 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story