Layoffs: ఉద్యోగులకు షాక్.. జీఈ లో 1000 ఉద్యోగాలు కోత

Layoffs: ఉద్యోగులకు షాక్.. జీఈ లో 1000 ఉద్యోగాలు కోత

1,000 మంది ఉద్యోగులను తొలగించాలని జనరల్ ఎలక్ట్రిక్ యోచిస్తోంది. ఈ చర్య భారతీయ సిబ్బందిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. జీఈ రెన్యూవబుల్ ఎనర్జీకి చెందిన ఎల్ఎం విండ్ పవర్ బిజినెస్ సీఈఓ ఒలివర్ ఫాంటన్ ఉద్యోగులతో మాట్లాడుతూ రాబోయే నెలల్లో ఉద్యోగుల తొలగింపు ఉండబోతోందన్నారు.

ఎల్ఎం విండ్ పవర్ బిజినెస్ నుంచి రాబోయే వారాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభం కావచ్చు. మార్కెట్ సవాళ్ల కారణంగా, లే ఆఫ్స్ తప్పడం లేదని ఒలివర్ ఫాంటన్ ఉద్యోగులకు తెలిపారు. డెన్మార్క్ కు చెందిన ఎల్ఎం విండ్ పవర్ ను జీఈ 2017లో 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విండ్ టర్బైన్ల కోసం రోటార్ బ్లేడ్లను తయారు చేసే ఈ కంపెనీ జీఈ వెర్నోవాలో భాగంగా ఉంది.

జీఈ నుంచి ప్రపంచవ్యాప్తంగా, 1000 ఉద్యోగాల తొలగింపు ఉండబోతోందని సమాచారం. ఈ మేరకు మార్చి 26న కంపెనీ తన ఉద్యోగులకు ఒక ఇమెయిల్ పంపించింది. డెన్మార్క్, స్పెయిన్, పోలాండ్, కెనడా, చైనా, ఇండియా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ సహా మరెన్నో దేశాలలో జీఈ ఉనికిని కలిగి ఉంది. 2007లో భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థలో 200 మందికి పైగా ఇంజినీర్లు ఉన్నారు. ఎల్ఎం విండ్ పవర్ లో లే ఆఫ్స్ ప్రభావం భారతీయ ఉద్యోగులపై కూడా ఉండనుందని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story