TS TET and AP Polycet : టీఎస్ టెట్, ఏపీ పాలిసెట్ అప్లైకి నేడు ఆఖరు

X
By - Manikanta |10 April 2024 10:15 AM IST
ఏపీ పాలిసెట్-2024 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 5న గడువు ముగియాల్సి ఉండగా, 10వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష ఈనెల 27న జరగనుంది. పరీక్ష తేదీలో మార్పు ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇక తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. మంగళవారం సాయంత్రం నాటికి మొత్తం 1,93,135 మంది దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1కు 72,771 దరఖాస్తులు రాగా..పేపర్ 2కు 1,20,364 వచ్చాయి. 2016లో నిర్వహించిన టెట్ కు 3.40 లక్షల దరఖాస్తులు రాగా, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83 దరఖాస్తులు వచ్చాయి
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com