Recruitment: స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి టీటీడీ నిర్ణయం

స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులను భర్తీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశమయింది. ‘2014కి ముందు టీటీడీలో నియమించిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు. దేవస్థానం పరిధిలోని అన్ని కళాశాలల్లో అదనపు భవనాల నిర్మాణం. పురాతన ఆలయాలకు మరమ్మతులు. ఐటీ సేవలకు రూ.12 కోట్ల నిధుల కేటాయింపు’ వంటి నిర్ణయాలను బోర్డు తీసుకుంది.
మరోవైపు టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్టళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదించింది.
టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలన అనుమతికి ఆమోదం లభించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబంకు 5లక్షలు పరిహారంను ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com