Vijay's Political Party : రాజకీయాల్లోకి యంగ్ హీరోయిన్.. విజయ్ పార్టీలోకి వెళ్లనుందా?

సిరియళ్లలో నటించి అనంతరం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ బ్యూటీ వాణి భోజన్. ఓ మై కడవులే సినిమాతో ఈ అమ్మడు హీరోయిన్ గా మారింది. తన అందం, అభినయంతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసి నటిగా మంచి పేరు సంపాదించుకుంది. తమిళ్ రాకర్స్ వంటి వెబ్ సీరీస్లోనూ ఆమె నటించింది. అయితే ఇటీవలే తమిళ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని స్థాపించి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దీనిపై ఓ ఇంటర్వ్యులో వాణి అభిప్రాయం అడగ్గా.. విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆమె స్వాగతించింది. విజయ్ చాలా కాలంగా సేవా కార్యక్రమాలు చేస్తు న్నారని.. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం మంచి నిర్ణయమే అని అభిప్రాయపడింది. ఆయనకు ప్రజలు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరింది. సెంగళం అనే వెబ్ సిరీస్ లో తాను రాజకీయ నాయకురాలి పాత్రను పోషించినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే తనకు రాజకీయాల పై ఆసక్తి కలిగిందని వెల్లడించింది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని ఉందని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com