Apple Warning : 92 దేశాల యూజర్లకు ఆపిల్ వార్నింగ్

ఆపిల్ (Apple) సంస్థ తమ ఫోన్లు వాడుతున్న వారికి వార్నింగ్ ఇచ్చింది. ఇండియాతో పాటు మొత్తం 92 దేశాల్లో ఉన్న యూజర్లకు ఆ హెచ్చరిక వెళ్లింది. మెర్సినరీ స్పైవేర్‌తో అటాక్ జరిగే ప్రమాదం ఉన్నట్లు ఆ వార్నింగ్ నోటిఫికేషన్‌లో యాపిల్ సంస్థ వెల్లడించింది. మీరు మెర్సినరీ స్పైవేర్ బాధితులు అయి ఉంటారని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ఐఫోన్లను హ్యాక్ చేసేందుకు అటాకర్లు ప్రయత్నించి ఉంటారని ఆ వార్నింగ్‌లో తెలిపారు. బుధవారం రాత్రి ఈ మెయిల్ ద్వారా ఆ నోటిఫికేషన్ పంపారు. యాపిల్ సంస్థ తన ప్రకనటలో పెగాసస్ స్పైవేర్ గురించి కూడా ప్రస్తావించింది.
విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్న ఇండియాలో ఆ స్పైవేర్ గురించి 2021లో పెను దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. మెర్సినరీ స్పైవేర్ దాడులకు గురైన వ్యక్తులు కానీ యూజర్లు కానీ తమ నోటిఫికేషన్ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని యాపిల్ సంస్థ తన స్టేట్మెంట్‌లో తెలిపింది. మెర్సీనరీ స్పైవేర్ వల్ల మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందని, ఆ స్పైవేర్‌కు చాలా షార్ట్ లైఫ్ ఉంటుందని, ఆ స్పైవేర్‌ను డిటెక్ట్ చేసి, అడ్డుకోవడం అంత సులువైన విషయం కాదు అని యాపిల్ సంస్థ తన ప్రకటనలో చెప్పింది. కానీ ఎక్కువ శాతం యూజర్లను మాత్రం ఆ స్పైవేర్‌తో టార్గెట్ చేయరని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com