Lok Sabha Protem Speaker : లోక్ సభ ప్రొటెమ్ స్పీకర్ గా భర్తృహరి
లోక్ సభ ప్రొటెమ్ స్పీకర్ గా ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్ ను ( Bhartruhari Mahtab ) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. తాత్కాలిక పోస్టు అయిన ప్రొటెమ్ స్పీకర్ పదవిని సాధారణంగా సభలో సీనియర్ మోస్ట్ ఎంపీకి ఇస్తారు. స్పీకర్ నియమితులయ్యే వరకు కేబినెట్ మంత్రులు, ఇతర ఎంపీలతో ప్రొటెమ్ స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఆయన స్థానంలో స్పీకర్ ను ఎన్నుకుంటారు.
భర్తృహరి కటక్ నుంచి ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒడిశాలో ఇటీవలి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేడీని వీడి బీజేపీలో చేరారు. కాగా, లోక్ సభ స్పీకర్ పదవికి ఒడిశా లేదా ఏపీ నేతను ఎన్నుకోనున్నట్టు తెలుస్తోంది. ఒడిశా నుంచి భర్తృహరి, ఏపీ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరి ( BJP Chief Purandeswari ) పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. సోమవారం జరిగే పార్లమెంటు భేటీకి ముందే స్పీకర్ పదవిపై ప్రధాని మోదీ ( PM Modi ) నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com