Bomb Threat : రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపు

తమిళనాడులో రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. మీడియా కథనాల ప్రకారం, కోయంబత్తూర్‌లోని పిఎస్‌బిబి మిలీనియం స్కూల్ మరియు కాంచీపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
కోయంబత్తూరులోని పిఎస్‌బిబి మిలీనియం స్కూల్‌కు మార్చి 3న రాత్రి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిందని, కాంచీపురంలోని పాఠశాలకు ఉదయం కాల్‌లో బెదిరింపు వచ్చిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అనంతరం కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు పోలీసు సిబ్బంది చేరుకున్నారు. స్కూల్‌లో బాంబు పెట్టినట్లు తమకు బెదిరింపు మెయిల్ వచ్చిందని స్కూల్ యాజమాన్యం సెక్యూరిటీ అధికారులకు తెలిపింది.
కాంచీపురం పాఠశాలకు వచ్చిన బెదిరింపు కాల్ బూటకపు కాల్ అని పోలీసులు తెలిపారు. అయితే, మెయిల్, కాల్ వివరాలను కనుగొనడానికి పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఇకపోతే రెండు నగరాల్లోని పాఠశాలల చుట్టూ అధికారులు భద్రతను పెంచారు. సరైన తనిఖీ లేకుండా ఎవరినీ పాఠశాల లోపలికి అనుమతించవద్దని భద్రతా సిబ్బందికి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com