ఎన్నికలను బహిష్కరిస్తాం : వరుస అరెస్టులపై మత్స్యకారులు

సముద్ర సరిహద్దు దాటినందుకు రెండు వేర్వేరు ఘటనల్లో 32 మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన నేపథ్యంలో పలువురు మత్స్యకారులు వచ్చే లోక్‌సభ ఎన్నికలను (Lok Sabha Elections) బహిష్కరించాలని ఆలోచిస్తున్నారు. తమ జీవనోపాధి భద్రతపై ఆందోళన చెందుతున్న మత్స్యకారులు శ్రీలంక నావికాదళం పదేపదే అరెస్టులు, జప్తులపై నిరాశను వ్యక్తం చేశారు.
నెడుంతీవు సమీపంలో 25 మంది మత్స్యకారులను అరెస్టు చేసి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో రామేశ్వరానికి చెందిన ఏడుగురు మత్స్యకారులను మన్నార్ ప్రాంతంలో రెండు పడవలతో అరెస్టు చేశారు. పట్టుబడిన మత్స్యకారులను, స్వాధీనం చేసుకున్న పడవలను జాఫ్నా మత్స్యశాఖ అధికారులకు అప్పగించారు.
ఇది పునరావృత సమస్యగా మారిందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నామని, స్మగ్లింగ్‌లో పాల్గొనడం లేదని, కేవలం చేపల వేట మాత్రమేనని, గత దశాబ్ద కాలంలో 350 బోట్లను పోగొట్టుకున్నామని రామేశ్వరం ఆల్ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి పచ్చ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com