Breaking.. లోక్‌సభ బరిలో రాధిక శరత్ కుమార్

లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) సందర్భంగా బీజేపీ (BJP) నాలుగో జాబితాను విడుదల చేసింది. 15 మందితో నాలుగో లిస్టును రిలీజ్ చేయగా.. అందులో 14 తమిళనాడు, ఒకటి పుదుచ్చేరి స్థానాలున్నాయి. నటి రాధిక శరత్ కుమార్ విరుధునగర్ నుంచి పోటీ చేయనున్నారు. కాగా.. ఇటీవలే రాధిక భర్త పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించి జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది.
రాధిక శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో మెప్పించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com