Car Accident : కారు చెట్టును ఢీకొని, ముగ్గురు మృతి

Car Accident : కారు చెట్టును ఢీకొని, ముగ్గురు మృతి
X

మధ్య ప్రదేశ్ లో సోమవారం (మార్చి 25) దామోహ్ పటేరా ప్రాంతం సమీపంలో కారు చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత ఐదుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు జిల్లా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గాయపడిన ఇద్దరికి దామోలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.

"పటేరా సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. మొత్తం ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు" అని పటేరా, SHO అమిత్ గౌతమ్ చెప్పారు. మృతుల్లో ముగ్గురి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story