Rain Expected : ఢిల్లీ కూల్ కూల్.. రెండు రోజులు వర్ష సూచన

మండే ఎండల్లో క్యుములో నింబస్ మేఘాల ప్రభావం, ఈదురుగాలులు, మోస్తరు వర్షాలతో దేశంలోని ప్రధాన నగరాలు చల్లబడుతున్నాయి. న్యూ ఢిల్లీలో శుక్రవారం రాత్రి నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు బలంగా చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు.
దేశ రాజధానిలో చాలాచోట్ల చెట్లు నేలకూలడంతోపాటు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్‌కు మళ్లించారు.
బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్ 58లో ఒక భవనం మరమ్మతు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. శనివారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com