DMK : ప్రతి మహిళకు రూ.1000 ఇస్తాం .. డీఎంకే హామీ

తమిళనాడులో (Tamilnadu) అధికార పార్టీ డీఎంకే (DMK) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోను డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఉదయం చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో విడుదల చేశారు. NHలపై టోల్ బూత్‌ల తొలగింపు, ప్రతి మహిళకు రూ.1000, విద్యార్థులకు NEET నుంచి మినహాయింపు, మహిళలకు 33% రిజర్వేషన్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను రూ.75, రూ.65,రూ.500గా ఖరారు చేస్తామని పేర్కొంది.
స్టూడెంట్స్‌కు ఫ్రీ సిమ్ కార్డు, నెలకు 1జీబీ డేటా, స్వయం సహాయక మహిళా గ్రూపులకు రూ. 10లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని స్టాలిన్ విమర్శించారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేశామని, ఈ ఎన్నికల అనంతరం జాతీయ రాజకీయాల్లో తాము కీలక పాత్రను పోషించబోతోన్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com