National News :హిందువులతో భారత ముస్లింలకు సమాన హక్కులు.. అమిత్ షా అభయం

భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 అమలులోకి వచ్చింది. దీనిపై ముస్లింలలో ఉన్న భయాన్ని కేంద్రం తొలగిస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేసింది. హిందువులతో సమానంగా భారత ముస్లింలకు హక్కులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఎలాంటి రుజువు చూపించాల్సిన అవసరం లేదని తెలిపింది.
సీఏఏకి సంబంధించి ముస్లింలు, విద్యార్థులలో ఒక వర్గానికి ఉన్న భయాలను తొలగించడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నించింది, "ఈ చట్టం తర్వాత తన పౌరసత్వాన్ని నిరూపించడానికి ఏ భారతీయ పౌరుడిని ఏ పత్రాన్ని సమర్పించమని అడగదు" అని స్పష్టం చేసింది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం వేగవంతం చేయడానికి పౌరసత్వ (సవరణ) చట్టాన్ని కేంద్రం సోమవారం నోటిఫై చేసింది.
''పాక్, బంగ్లా, ఆప్ఘన్ మూడు ముస్లిం దేశాలలో మైనారిటీలను హింసించడం వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం పేరు ఘోరంగా చెడిపోయింది. ఏది ఏమైనప్పటికీ, ఇస్లాం శాంతియుతమైన మతం అయినందున, ద్వేషాన్ని, హింసను, మతపరమైన ప్రాతిపదికన ఎలాంటి హింసను ప్రబోధించదు లేదా సూచించదు'' అని హోం మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ చట్టం "హింసల పేరుతో ఇస్లాం మతం కళంకం చెందకుండా రక్షిస్తుంది" అని వివరించింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం భారతీయ పౌరసత్వం పొందేందుకు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ముస్లింలకు ఎటువంటి నిషేధం లేదని క్లారిటీ ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com