Fire Mishap : ఉజ్జయిని ఆలయంలో మంటలు.. 13 మందికి గాయలు

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాలేశ్వరుడి సన్నిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తెల్లవారు జామున భస్మహారతి ఇస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో 13 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ఆలయ పూజారి కూడా ఉన్నారు.
పూజారి హారతి సమర్పిస్తున్న సమయంలో వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే అక్కడకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై జిల్లా కలెక్టర్ నీరజ్ కుమార్ విచారణకు ఆదేశించారు.
ఢిల్లీ లోనూ అగ్ని ప్రమాదం
ఢిల్లీలోని బుద్పూర్ అలీపూర్ లో ఉన్న బట్టలు ఫ్రిడ్జ్ గోదాంలోనూ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని దాదాపు 34 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఎవరికీ హాని కలగలేదని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com