BJP : బీజేపీ మాజీ ఎంపీ కాన్వాయ్ పై రాళ్ల దాడి

BJP : బీజేపీ మాజీ ఎంపీ కాన్వాయ్ పై రాళ్ల దాడి

మహారాష్ట్రలోని (Maharashtra) రత్నగిరిలోని (Ratnagiri) చిప్లూన్ ప్రాంతంలో బీజేపీ (BJP) నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) నీలేష్ రాణే కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఫిబ్రవరి 16న చోటుచేసుకుంది. పలు నివేదికల ప్రకారం, శివసేన (యూబీటీ) నాయకుడు, ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ కార్యాలయం ముందు శివసేన యుబిటి వర్గ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడిన తరువాత ఈ దాడి జరిగింది.

"రాణే, శివసేన (UBT) నాయకుడు భాస్కర్ జాదవ్ మద్దతుదారులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి బాష్పవాయువు షెల్స్ లాబ్ చేయాల్సి వచ్చింది. రాణే ఒక బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా రాణే కారుపై ఎవరో రాళ్లు రువ్వారు. దీంతో ఘటనా స్థలంలో బీజేపీ కార్యకర్తలు గుమిగూడారు. ఆ తర్వాత రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వారు”అని గుహగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్లు ఇంకా నివేదిక లేనప్పటికీ కొన్ని కార్లు దెబ్బతిన్నాయని, ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని అధికారి తెలిపారు. ఈ విషయంపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ఈ తరహా రాజకీయ దాడిని బట్టి ప్రతిపక్షాల నిరాశ స్పష్టంగా కనిపిస్తోందని, చిప్లూన్ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story