Ex-Judges : సీజేఐకి 21 మంది మాజీ న్యాయమూర్తులు లేఖ

21మంది మాజీ న్యాయమూర్తులు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) DY చంద్రచూడ్‌కు లేఖ రాశారు. ఒత్తిడి, తప్పుడు సమాచారం, బహిరంగ అవమానం ద్వారా న్యాయవ్యవస్థను అణగదొక్కడానికి కొన్ని వర్గాలపై పెరుగుతున్న ఒత్తిడి ప్రయత్నాలపై తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఏప్రిల్ 14న వారు రాసిన లేఖలో, రిటైర్డ్ న్యాయమూర్తులు తప్పుడు సమాచారం వ్యూహాలు, న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజా సెంటిమెంట్ ఆర్కెస్ట్రేషన్ అని పిలిచే వాటి గురించి ఆందోళన చెందుతున్నామని, ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు హానికరమని ఆరోపించారు.
ఈ విమర్శకులు సంకుచిత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలతో ప్రేరేపించబడ్డారు. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లడానికి ప్రయత్నిస్తున్నారని న్యాయమూర్తులు ఆరోపించారు. కొందరికి అనుకూలంగా ఉండే న్యాయ నిర్ణయాలను ప్రశంసించడం. అలా లేని వాటిని తీవ్రంగా విమర్శించడం, న్యాయ సమీక్ష సారాంశాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో అధికార ఎన్డీయే, విపక్షాల మధ్య వాగ్యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో మాజీ న్యాయమూర్తులు ఈ లేఖ రాయడం గమనార్హం. న్యాయపరమైన ఫలితాలను, తీర్పులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఆయా వర్గాలు అనుసరిస్తున్న వ్యూహాలు తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్న మాజీ న్యాయమూర్తులు.. అనవసర ఒత్తిళ్ల నుంచి న్యాయవ్యవస్థ స్వతంత్రను రక్షించాలని సీజీఐను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com