NDA జోరుకు బ్రేకులు వేసిన ఇండియా కూటమి

NDA జోరుకు బ్రేకులు వేసిన ఇండియా కూటమి
X

‘400 పార్..’ ఆశించిన NDAకి ఓటర్లు 292 సీట్లతో సరిపెట్టారు. మెజార్టీ మార్క్ అయిన 272 దాటడంతో త్వరలోనే NDA కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. లెక్కింపులో భాగంగా ఓ దశలో NDA 300 స్థానాల్లో ఆధిక్యం సంపాదించినా ఇండియా కూటమి NDA జోరుకు బ్రేకులు వేసింది. మరోవైపు 295 సీట్లు వస్తాయని ఆశించిన ఇండియా కూటమికి 234 సీట్లు దక్కాయి. దీంతో పాటు 17 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

NDA 293 సీట్లకే పరిమితం కావడం వెనుక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్, బిహార్ రాష్ట్రాల ప్రభావం ఉందంటున్నారు విశ్లేషకులు. యూపీలో 80 సీట్లూ క్లీన్ స్వీప్ చేస్తామని ఆశించిన బీజేపీకి 36 సీట్లే వచ్చాయి. మహారాష్ట్రలో 2019లో 48లో 41 సీట్లు సాధించిన NDA ఈసారి 17 సీట్లకు పరిమితమైంది. బెంగాల్‌లో TMC దెబ్బకు BJP 12 సీట్లకే చతికిలపడింది. బిహార్‌లోనూ NDA 2019తో పోలిస్తే తొమ్మిది సీట్లు కోల్పోయి 39కి పరిమితమైంది.

ఇండియా కూటమికి నార్త్ జోన్‌లో 44.98% ఓటింగ్ షేర్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ 43% పెరిగింది. ఈస్ట్ జోన్‌లో 42.71% (17% వృద్ధి), సౌత్ జోన్‌లో 40.35% (11% వృద్ధి), వెస్ట్ జోన్‌లో 39.25% (28% వృద్ధి) నమోదైంది. మరోవైపు NDAకి ఈస్ట్ జోన్‌‌లో 43.98% (-6%), నార్త్ జోన్‌లో 42.54% (-37%), సౌత్ జోన్‌‌లో 37.09% (16% వృద్ధి), వెస్ట్ జోన్‌‌లో 53.11% (-29%) నమోదైంది.

Tags

Next Story