Milk Production in India : పాల ఉత్పత్తిలో భారత్ టాప్.. తొలి 5 రాష్ట్రాలివే!

X
By - Manikanta |27 Nov 2024 9:00 PM IST
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ నం.1గా నిలిచింది. 2022-23లో 23.58 కోట్ల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2023-24లో 23.93 కోట్ల టన్నులకు చేరింది. గడిచిన దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా 2% పెరుగుదల కనిపించగా భారత్‌లో 6% వృద్ధి ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. గేదెల నుంచి ఉత్పత్తి 16% తగ్గినా దేశవాళీ ఆవుల నుంచి 44.76% పెరిగింది. నివేదిక ప్రకారం..పాల ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ 16.21శాతం, రెండోస్థానంలో రాజస్థాన్ 14.51శాతం, మధ్యప్రదేశ్ 8.91 శాతం, గుజరాత్ 7.65శాతం, మహారాష్ట్ర 6.71శాతం ఉంది. ఈ ఐదు రాష్ట్రాలు దేశంలోని మొత్తం పాల ఉత్పత్తిలో ఇవి 53.99శాతం వాటాను కలిగిఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com