Delhi CM : కేజ్రీవాల్ సైన్యం.. ఇండియా వైడ్ ప్రొటెస్ట్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అరెస్టు చేయడంతో.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు ఆప్ ఢిల్లీ విభాగం గురువారం పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని, నియంతృత్వ విధానం అని రాయ్ అన్నారు.
గురువారం సాయంత్రం ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి ఏజెన్సీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లారు అధికారులు. ఫెడరల్ ఏజెన్సీ చర్యల నుండి ఆప్ జాతీయ కన్వీనర్‌కు రక్షణ కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొన్ని గంటల తర్వాత, సిట్టింగ్ ముఖ్యమంత్రి అరెస్టు జరిగింది. ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బిజెపి కార్యాలయాలకు బయట నిరసన తెలపాలని ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చింది పార్టీ అధినాయకత్వం. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఆప్ ఆఫీస్ లోనే కార్యకర్తలు బైఠాయించారు. కేజ్రీవాల్ అంటే వ్యక్తి కాదనీ.. ఆయన ఓ భావజాలమని.. లక్షలాది మంది అభిమానులు రోడ్డెక్కితే అరెస్ట్ చేస్తారా అని ఎదురు ప్రశ్నించారు ఆప్ మంత్రి రాయ్.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమకు 400 సీట్లు రాదని, కేవలం 40 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు ఆప్ మంత్రులు. కాషాయ పార్టీ ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ ప్రజలు తమ పోరాటంలో భాగం కావాలని ఆయన కోరారు. ఢిల్లీ మంత్రులు అతిషి, రాయ్, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విధానాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల రాజధానుల్లో ఆప్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ ఫొటోలు,వీడియోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com