Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. చేరుకున్న 34ఫైర్ ఇంజన్లు

Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. చేరుకున్న 34ఫైర్ ఇంజన్లు

బుద్‌పూర్ అలీపూర్ ప్రాంతంలోని ఓ గోడౌన్‌లో ఈ రోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, వ్యాపిస్తోన్న మంటలను ఆర్పడానికి మొత్తం 34 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం 6 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

"ఉదయం 6.15 గంటలకు మాకు అగ్నిప్రమాదానికి సంబంధించిన కాల్ వచ్చింది. మొత్తం 34 అగ్నిమాపక టెండర్లను సర్వీస్ లో ఉంచారు. ఆయిల్ గోడౌన్‌లో మంటలు వ్యాపించాయి. మంటలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి" అని DFS చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

Tags

Next Story