Cabinet Meeting : మార్చి 3న కేంద్ర కేబినెట్ భేటీ

Cabinet Meeting : మార్చి 3న కేంద్ర కేబినెట్ భేటీ

లోక్ సభ (Lok Sabha) ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మార్చి రెండవ వారంలో ఎన్నికల కమిషన్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో, మార్చి 3న ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మార్చి 3న కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఢిల్లీ చాణక్యపురిలోని సుష్మాస్వరాజ్ భవన్లో ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికల ప్రకటనకు కొన్ని రోజుల ముందే కేంద్రమంత్రి మండలి సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

లోక్సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించింది. స్థానిక అధికార యంత్రాంగంతో సమావేశమైంది. ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించింది. కాగా, 2014 ఎన్నికలను తొమ్మిది విడతల్లో నిర్వహించిన ఎన్నికల సంఘం, 2019లో ఏడు దశల్లోనే ముగించేసింది.

మార్చి 10న ఎన్నికల ప్రక్రియ మొదలవగా, మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సారి కూడా కాస్త అటుఇటుగా ఇదే షెడ్యూల్ ఉండొచ్చని తెలుస్తున్నది. మార్చి 9 తర్వాత షెడ్యూల్ ప్రకటించొచ్చని రెండు రోజుల కిందట జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు (ఆంధ్రప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ) శాసనసభ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story