Modi 3.0: రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్

Modi 3.0: రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్
X

ప్రధాని మోదీ ( Narendra Modi ) నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ కొలువుదీరింది. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా ఐదుగురు సహాయ(స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. మోదీ టీమ్‌లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కింది.

బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. మోదీ కేబినెట్‌లో మూడు సార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళా ఎంపీగా నిలిచారు. 2014లో పరిశ్రమలు, వాణిజ్య మంత్రిగా, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా చేశారు. 2019లో గెలిచాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మరోసారి మంత్రి పదవి దక్కింది.

మోదీ 3.0 కేబినెట్‌లో 72 మందికి చోటు కల్పించారు. ఇందులో మిత్రపక్షాల నుంచి 11 మంది ఉండటం గమనార్హం. వీరందరిలో 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. మొత్తం 39 మందికి గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మరో 23 మంది రాష్ట్ర అసెంబ్లీలో మంత్రులుగా చేశారు. కాగా 27 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, ఐదుగురు చొప్పున ఎస్టీ, మైనార్టీ కమ్యూనిటీలకు చెందిన నేతలకు అవకాశం కల్పించారు.

Tags

Next Story