PM Modi : లోక్ సభ ఎన్నికల్లో పనిచేయని మోదీ మ్యాజిక్
ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన బీజేపీకి ( BJP ) ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ మ్యాజిక్ అంతగా పనిచేయలేదు. ఈసారి ఆయన 184 సెగ్మెంట్లలో 206 ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారం చేయగా, కేవలం 99 సీట్ల(53%)లోనే NDA అభ్యర్థులు గెలిచారు. కంచుకోటలైన దాదాపు 35 సీట్లను NDA కోల్పోయింది. ఈ 184 సీట్లలో 2019లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 28 సీట్లు గెలవగా, ఈసారి 82 స్థానాలను సొంతం చేసుకుంది.
ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ ( PM Modi ) తమిళనాడుపై ఫోకస్ చేశారు. 6 నెలల్లోనే 10సార్లు పర్యటించారు. కానీ ఒక్క సీటూ దక్కలేదు. కేరళలోనూ ఇదే పరిస్థితి. ఆయన ప్రచారం చేసిన చోట బీజేపీ నేతలకు ఓటమే ఎదురైంది. గెలిచిన త్రిస్సూర్‌లో ఆయన ప్రచారం చేయకపోవడం గమనార్హం.ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోనూ బీజేపీపరిస్థితి దిగజారింది. ఆఖరికి అయోధ్యలోనూ ఓటమి తప్పలేదు. మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ మెజార్టీ 3 లక్షలకు పైగా తగ్గిపోయింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com