Lok Sabha Speaker Elections : 26న కొత్త స్పీకర్ ఎన్నిక.. జేడీయూ ఆసక్తికర ప్రకటన

లోక్ సభ స్పీకర్ ఎన్నిక ( Lok Sabha Speaker Election ) ఆసక్తిరేపుతోంది. ఈ నెల 26న కొత్త స్పీకర్ ఎన్నిక జరనుంది. బీజేపీ, టీడీపీ, జేడీయూ సహా ఎన్డీయే భాగస్వామ్య కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీకి స్పీకర్ పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి వస్తుందన్న చర్చ జరుగుతోంది. స్పీకర్ ఎప్పుడూ రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు.
భాగస్వామ్య పార్టీల కంటే బీజేపీ అభ్యర్థుల సంఖ్య ఎక్కువ కావడంతో.. బీజేపీ నుంచే స్పీకర్ అభ్యర్థి ఎన్నిక అవుతారని నిపుణులు చెబుతున్నారు. రూలింగ్ పార్టీ వారి సంఖ్యే ఎక్కువ ఉందని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు.
జేడీయూ వైఖరిని కేసీ త్యాగి ముందే చెప్పారు. స్పీకర్ పదవికి భారతీయ జనతా పార్టీ నామినేట్ చేసే అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. లోక్ సభ స్పీకర్ పదవికి రేసులో తమ అభ్యర్థి ఉండబోడని జేడీయూ తేల్చి చెప్పినట్టయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com