Warning : టెర్రరిస్టుల ఏరివేతలో రూల్స్ అవసరం లేదు.. జైశంకర్ డెడ్లీ వార్నింగ్

Warning : టెర్రరిస్టుల ఏరివేతలో రూల్స్ అవసరం లేదు.. జైశంకర్ డెడ్లీ వార్నింగ్

ఉగ్రవాదం అణచివేతపై హాట్ కామెంట్స్ చేశారు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్​ జైశంకర్​. ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్​ ఉండవని.. వారికి సమాధానం చెప్పేడప్పుడు కూడా రూల్స్​ ఉండకూడదని వ్యాఖ్యానించారు. ముంబై ఎటాక్స్ జరిగినప్పుడు.. కాంగ్రెస్ సరైన నిర్ణయాలు తీసుకోలేదని.. పాకిస్థాన్​పై దాడి చేయకపోతే అయ్యే ఖర్చు కంటే ఆ దేశంపై దాడి చేయడానికి అయ్యే ఖర్చే ఎక్కువ అని యూపీఏ తేల్చినట్టు ఆయన అన్నారు. ది గార్డియన్ పత్రిక.. భారత ఇంటెలిజెన్స్​ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లు.. వాంటెడ్ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్​లో లోతుగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయని కథనం ప్రచురించింది.

దీనిపై రియాక్టయిన జై శంకర్.. ఘాటుగానే స్పందించారు. తన పుస్తకం 'వై భారత్ మ్యాటర్స్' మరాఠీ అనువాదం ఆవిష్కరణ సందర్భంగా పుణెకు వెళ్లారు జైశంకర్. యువకులతో ముఖాముఖి సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ముంబై దాడిని జై శంకర్​ ప్రస్తావించారు. ముంబైలో 26/11 దాడుల తర్వాత అందరూ పాకిస్తాన్​కు సమాధానం చెప్పాలని భావించారని, కానీ యూపీఏ ప్రభుత్వం .. చర్చల్లో నిమగ్నమైపోయిందని అన్నారు.

ఉగ్రవాదులకు తేరుకునే టైం ఇవ్వకూడదు. టెర్రరిస్టులు ఎలాంటి నిబంధనలకు లోబడి ఉండరు. టెర్రరిస్టులకు సమాధానం చెప్పడానికి కూడా ఎలాంటి రూల్స్​ ఉండకూడదు అని అన్నారు జై శంకర్​. భారత్ కే కాదు.. ప్రపంచానికే పాకిస్థాన్ అతిపెద్ద సవాల్ గా మారిందన్నారు. 1947లో మొదలైన సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాం అని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story