Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
X

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎల్లుండి రాత్రి 7.15 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు రానుండటంతో 2,500 మంది పోలీసులతోపాటు 5 కంపెనీల పారామిలిటరీ దళాలు బందోబస్తు నిర్వహించనున్నాయి.

ఇక ప్రధానమంత్రి పట్టాభిషేక మహోత్సవానికి వివిధ వర్గాల వారికి ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. భారత్‌కు పొరుగున ఉన్న దేశాల అధినేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష సభ్యులు.. సినీ, క్రీడా, బిజినెస్ సహా పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. దాదాపు 7000 నుంచి 8000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అనేక ప్రాంతాలు పరిశీలించిన టీడీపీ నేతలు.. చివరకు కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి.

Tags

Next Story