PM Modi : మే14న ప్రధాని మోదీ నామినేషన్

వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆయన.. 13వ తేదీన స్థానికంగా భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ.. మూడోసారి ఇక్కడే బరిలోకి దిగుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అజయ్ రాయ్ బరిలో నిలుస్తున్నారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్‌కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
మొత్తం ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. ఏప్రిల్ 19న తొలి విడత, ఏప్రిల్ 26న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com