Jewelry Shop : నగల షాప్ లో రూ.116 కోట్లు సీజ్

Jewelry Shop : నగల షాప్ లో రూ.116 కోట్లు సీజ్
X

మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. సురానా జ్యువెల్లర్స్ దుకాణ దానియజమాని కార్యాలయంపై ఆదాయపు పన్ను దాడులు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ. 26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

సురానా జ్యువెలర్స్ యాజమాన్యం పన్ను ఎగవేతకు పాల్పడిందనే కారణంతో మే 23 సాయంత్రం దాదాపు 30 గంటలుగా ఐటీ శాఖ దాడులు నిర్వహించిభా నగదును జప్తు చేసింది. ఐటీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ సతీష్ శర్మ నేతృత్వంలో అధికారులు సురానా జ్యువెల్లర్స్, కార్యాలయంపైన దాడులు జరిపారు. నాసిక్, నాగ్ పూర్, జల్గావ్ బృందానికి చెందిన 50-55 మంది ఆ ఆపరేషన్లో పాల్గొన్నారు. అదే సమయంలో రాకా కాలనీలో ఉన్న సురానా జ్యువెల్లర్స్ యజమాని బంగ్లాలో కూడా తనిఖీలు చేపట్టారు.

ప్రైవేట్ లాకర్లు, ఆయనకు పలు ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు లాకర్లను తనిఖీ చేశారు. మన్మాడ్, నంద్గావ్లో ఉన్న సురానా జ్యువెల్లర్ యజమాని కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. తొలుత కార్యాల యాలు, ప్రైవేట్ లాకర్లలో కొద్దిపాటి నగదు మాత్రమే దొరికింది.

Tags

Next Story