Central Ministers : కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!

Central Ministers : కేంద్ర మంత్రులుగా ఏడుగురు మాజీ సీఎంలు!

ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కుమారస్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), రాజ్‌నాథ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), జితన్ రామ్ మాంఝీ (బిహార్) ఉన్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ, మిగతా ఇద్దరు ఇతర పార్టీలకు చెందినవారు.

ప్రధాని మోదీతో ( PM Modi ) సహా 72 మంది మందితో కేంద్ర మంత్రివర్గం కొలువుదీరింది. ఇందులో లూథియానా(పంజాబ్) నుంచి ఓడిన రవనీత్ సింగ్ బిట్టూకు అవకాశం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి రెండు సార్లు గెలిచిన బిట్టూ ఈ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆయనకు పదవి ఇవ్వడం ద్వారా పంజాబ్‌లో పార్టీని బలోపేతం చేసుకోవాలని మోదీ భావిస్తున్నారు. బిట్టూకు కీలక శాఖ అప్పగించే అవకాశం ఉంది.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్ కొలువుదీరింది. మోదీతో పాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా దక్కగా ఐదుగురు సహాయ(స్వతంత్ర), 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. మోదీ టీమ్‌లో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణకు చెందిన ఇద్దరికి ప్రాతినిధ్యం దక్కింది.

Tags

Next Story