Vishal : విశాల్ కొత్త పార్టీ

Vishal : విశాల్ కొత్త పార్టీ

కొత్త పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రముఖ తమిళ హీరో విశాల్ చెప్పారు. తెలుగులోనూ ఆయన చాలా సినిమాలతో పాపులరయ్యారు. పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండే విశాల్.. పొలిటికల్ స్టేట్ మెంట్ తో వార్తల్లోకి వచ్చారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు నటుడు విశాల్ మరోసారి స్పష్టం చేశాడు.

2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలోకి దిగుతానని ప్రకటించాడు విశాల్. పార్టీలు మంచి చేస్తే తాను రాజకీయాల్లోకి రాబోనని అన్నాడు. రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని వ్యాఖ్యానించాడు.

ఉన్న పార్టీలను విమర్శించడం లేదని.. వాళ్లు మంచిచేస్తే తాను తాను రాజకీయాల్లోకి రానవసరం లేదన్నారు. గ్రామాలను డెవలప్ చేయడంపై ఫోకస్ చేస్తానన్నారు. వేలంలో 'రత్నం' సినిమా షూటింగ్ సందర్భంగా ఈ క్లారిటీ ఇచ్చారు విశాల్. కొత్త పార్టీతోనే జనంలోకి వెళ్తానన్నారు.

Tags

Next Story