WAR: పాకిస్థాన్‌పై డిజిటల్ దాడి

WAR: పాకిస్థాన్‌పై డిజిటల్ దాడి
X
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్, పాక్ ఉద్రిక్తల వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌పై డిజిటల్ వార్ ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా పాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ, యూట్యూబ్ కంటెంట్‌ని ఇండియాలో బ్యాన్ చేశారు. అలాగే అన్ని రకాల స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి పాటలను, పాడ్‌కాస్ట్‌లను తొలిగించారు. పాక్ డిజిటల్ మీడియా ప్రసారాలు కూడా భారత్‌లో ఆగిపోయాయి. దాయాది దేశ వెబ్ కంటెంట్ పై, పాడ్ కాస్ట్‌లపై భారత్ నిషేధం విధించింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణం అమలులోకి రానున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ఎక్కడికి అక్కడా కూల్చివేసిన త్రివిధ దళాలు.. ఆపరేషన్ సిందూర్ ను కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పటికే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టెమ్ ‌ను భారత్ ధ్వంసం చేసింది. అయితే ఆపరేషన్ సిందూర్ ను ఆపేది లేదు దాడులకు ప్రతిదాడి ఉంటుందని కేంద్రం వెల్లడించింది.

Tags

Next Story