Cricket News : మరో 15 పరుగులు చేస్తే.. కోహ్లీ రికార్డు బద్దలు కొట్టనున్న పాక్ క్రికెటర్

అంతర్జాతీయ టీ20ల్లో 4వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్(4023) నిలిచారు. అతనికంటే ముందు విరాట్ కోహ్లీ(4037) ఈ ఘనత సాధించారు. మరో 15 రన్స్ చేస్తే అతను కోహ్లీని అధిగమించి లీడింగ్ రన్ స్కోరర్‌గా రికార్డు నెలకొల్పనున్నారు. ఈ లిస్టులో వీరిద్దరి తర్వాత రోహిత్ శర్మ (3974), స్టిర్లింగ్(3589), గప్తిల్ (3531) ఉన్నారు.
జూన్ 1 నుంచి 29 వరకు టీ20 ప్రపంచకప్ సమరం జరగనుంది. వెస్టిండీస్‌తో పాటు తొలిసారిగా అమెరికా టీ20 వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. 20 జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాయి. తొలుత సూపర్ 8 దశ ఉంటుంది. నాలుగు గ్రూప్‌లలో ఐదేసి జట్లున్నాయి. గ్రూప్ బిలో ఇండియా, పాకిస్థాన్ జట్లున్నాయి. సూపర్ 8 తర్వాత నాకౌట్ స్టేజ్ ప్రారంభం అవుతుంది. టాప్ 4 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com