Canada T20 World Cup Team : టి20 ప్రపంచకప్ కు కెనడా జట్టు అర్హత

మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న టి20 వరల్డ్ కప్‌లో కెనడా జట్టు తొలిసారి అడుగుపెట్టింది. ఈ క్రమంలో వరల్డ్ కప్‌లో ఆడబోయే తుది జట్టును కెనడా క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. సాద్ బిన్ జాఫర్ సారధ్యంలో బరిలోకి దిగనున్న 15 మందితో కూడిన జట్టును రివీల్ చేసింది. ఈ టోర్నీకి మొత్తం కుర్రాళ్లతో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న కెనడా గ్రూప్ ‘ఏ’ లో ఉంది. భారత్, అమెరికా, ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లు సైతం ఇదే గ్రూప్‌లో ఉన్నాయి. జూన్ 1న జరిగే ఆరంభ పోరులో ఆతిథ్య అమెరికాతో కెనడా ఢీకొననుంది.
కెనడా జట్టు : సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), అరోన్ జాన్సన్, డిలాన్ హేలింగర్, దిల్‌ప్రీత్ బజ్వా, హర్ష్ థకెర్, జెరెమి గోర్డన్, జునైద్ సిద్దిఖీ, ఖలీమ్ సనా, కన్వర్పల్ తథ్గుర్, నవ్‌నీత్ ధలివాల్, నికోలస్ కిర్టన్, పర్గత్ సింగ్, రవీందర్‌పాల్ సింగ్, రయ్యన్‌ఖాన్ పఠాన్, శ్రేయాస్ మొవ్వ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com