Ravichandran Ashwin : ఆ ఒక్క వికెట్ మధ్యలో చాలా జరిగాయి: అశ్విన్ భార్య ఎమోషనల్

టీంఇండియా ప్లేయర్ రవిచంద్ర న్ అశ్విన్ (Ravichandran Ashwin) భార్య ప్రీతి భావోద్వేగ పోస్ట్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా అశ్విన్ అరుదైన ఘనత సా ధించడంపై ఎమోషనల్ గా స్పందించింది. 500-501 వికెట్కు మధ్య చాలా జరిగాయని పేర్కొంది. ‘హైదరాబాద్లో జరిగిన టెస్టులో నే 500 వికెట్లు సాధించాలని అశ్విన్ ఎంతో ప్రయత్నించాడు. అది జరగలేదు. వైజాగ్ నూ సాధ్యం కాలేదు.
అప్పటికే కొని ఉంచిన స్వీట్లను 499 సాధించినప్పుడే పంచిపెట్టాం. మూడో టెస్టులో 500వ వికెట్ దక్కింది. కానీ.. మేమంతా సైలెంట్ గా ఉండిపోయాం. మా జీవితంలో అత్యంత సుదీర్ఘంగా గడిచిన 48 గంటలు ఇవి. నేను మాట్లాడుతుందంతా500వ వికెట్, అంతకుముందు ప్రదర్శన గురించి. నిజంగా అశ్విన్ అసాధారణమైన వ్యక్తి. అతడిని చూసి ఎంతో గర్వపడుతున్నా. మేము ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం' అని పోస్ట్ చేసింది.
కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు మధ్యలో అశ్విన్ చెన్నైకి వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. రాజ్‌కోట్ టెస్టు రెండో రోజు ఆటలో జాక్ క్రాలీని ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 500 వికెట్ పడగొట్టిన అశ్విన్.. నాలుగో రోజు ఆటలో టామ్ హార్ట్లీని ఔట్ చేసి 501 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మ్యాచ్‌లో భారత్ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com