Smriti Mandhana : స్మృతి మంధాన అరుదైన ఘనత

Smriti Mandhana : స్మృతి మంధాన అరుదైన ఘనత
X

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ( Smriti Mandhana ) అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా స్మృతి (7) నిలిచారు. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (7) రికార్డును ఆమె సమం చేశారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఈ ఫీట్ అందుకున్నారు. మిథాలీ ఈ ఫీట్‌ను 211 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, స్మృతి 84 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం.

వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ మంధన తర్వాత హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11వ స్థానం), దీప్తి శర్మ (20) టాప్‌-20లో ఉన్నారు. టీ20ల్లో మంధన తర్వాత హర్మన్‌ప్రీత్‌ (13), షఫాలీ వర్మ (15), జెమీమా రోడ్రిగెజ్‌ (19) టాప్‌-20లో ఉన్నారు.

ఇక సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(136), కెప్టెన్ హర్మన్(103) సెంచరీలతో చెలరేగారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 3 వికెట్ల నష్టానికి 325 రన్స్ చేసింది. షఫాలీ వర్మ(20), హేమలత(24), రిచా ఘోష్(25) పర్వాలేదనిపించారు. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే.

Tags

Next Story