Sunil Chhetri : సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి (Sunil Chhetri) అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఇవాళ రాత్రి 7 గంటలకు అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచు ఆయనకు 150వది. దీంతో భారత్ తరఫున 150 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచులు ఏకైక ఆటగాడిగా ఆయన నిలవనున్నారు. అలాగే ఈ మైలురాయిని చేరుకున్న 40వ ప్లేయర్‌గా నిలవనున్నారు.
ఛెత్రి తన కెరీర్‌లో ఇప్పటివరకు 93 గోల్స్ చేశారు . ఇంకో రెండేళ్లు ఆటలో ఉండి, ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. మెస్సీ(103), అలీ డాయ్ (109)ను అధిగమించి ఆసియా నంబర్‌వన్ స్టార్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించడం ఖాయం. ఇక ప్రపంచ స్థాయిలో తనకంటే క్రిస్టియానా రొనాల్డో (123), అలీ డాయ్ (109), లియోనెల్ మెస్సి (103) మాత్రమే ముందున్నారు.
2005లో 21 ఏళ్ల వయసులో ఉన్న సునీల్.. పాకిస్థాన్ జట్టు పైనే తన తొలి అంతర్జాతీయ గోల్‌ను సాధించాడు. అప్పుడు, ఇప్పుడు రెండు జట్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పుడు ఆడిన మిగతా ఆటగాళ్లలో ఎవ్వరూ ప్రస్తుత జట్లలో లేరు. కానీ ఇప్పటికీ జట్టులో తిరుగులేని స్టార్‌గా కొనసాగుతుండటం సునీల్ ప్రత్యేకతను చాటుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com